![]() |
![]() |
.webp)
సింగర్ చిన్మయి అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు. ఈవిడ ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా. ఎక్కడ ఏ చిన్న విషయం తప్పుగా అనిపించినా నిప్పులు చెరగడం ఈమె నైజం. తప్పు చేసిన వారెవరైనా చిన్నా, పెద్దా అని కూడా చూడరు.. వారిని విమర్శించడానికి, కడిగిపారేయడానికి ఆమె ఎంతమాత్రమూ వెనుకాడరు. ఎక్కడో ఏదో జరిగింది నాకు సంబంధం లేదులే అని ఎంతమాత్రమూ అనుకోరు. అలాంటి సింగర్ చిన్మయి రీసెంట్గా ఒక ఇష్యూ మీద గొంతు విప్పారు.
బిగ్ బాస్ రన్నర్ శ్రీహాన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోను ఆమె తప్పుబట్టారు. అసలు ఈ వీడియోలో ఏముందో చూస్తే.. సిరితో కలిసి తను పెంచుకుంటున్న బాబుకు భయం చెప్పడం కోసం శ్రీహాన్ తనని తాను బెల్టుతో కొట్టుకుంటూ ఉన్నాడు. మాములుగా ఐతే అందరి ఇళ్లల్లో మాట వింటావా లేదా అని పిల్లల్ని పెద్దవాళ్ళు భయపెడతారు, వీపు మీద నాలుగు దెబ్బలు వేస్తారు. అందుకు భిన్నంగా శ్రీహాన్ తనని తాను సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ.. పిల్లాడికి భయం చెప్తున్నాడు.
ఇక సింగర్ ఈ వీడియో మీద రెస్పాండ్ అయ్యారు. మన సొసైటీలో పిల్లలు మాట వినినప్పుడు పెద్దవాళ్ళు ఇలాగే తమని తాము తిట్టుకుని, కొట్టుకుని, గాయాలు చేసుకుని బెదిరిస్తూ ఉంటారు. బాల్యం నుంచే పిల్లలకు ఇలాంటి అస్సలు నేర్పించకూడదు. ఫ్యూచర్ జెనెరేషన్స్ లో ఇలాంటి బెదిరింపులతో భయపెట్టే కల్చర్ అస్సలు ఉండకూడదు. పిల్లల మనసులపై ఇలాంటి ఘటనలు చెరగని ముద్ర వేస్తాయి అని అన్నారు.
ఇక చిన్మయి హీరోయిన్ సమంతకు కొంతకాలం క్రితం వరకు డబ్బింగ్ చెప్పారు. ఐతే ఆమె ముక్కుసూటితనమే ఆమెకు చిక్కులు తెచ్చిపెడుతోంది. అవకాశాల్ని తగ్గించేస్తోంది. దాని కారణంగా ఆమెకు చాలా తక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి.
![]() |
![]() |